ప్రయాణికులకు తీపి కబురు: దసరా పండుగకు ఐదు వేల ప్రత్యేక బస్సులు
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌలభ్యం కోసం ఐదు వేల రెండు వందల అరవై ఒక్క ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ నెల పదహారు నుంచి ఇరవై ఐదు వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై వంటి రద్దీ ప్రాంతాలకు అదనపు సర్వీసులు నడిపిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.