దేశంలోనే అత్యంత ధనిక నటుడిగా షారుఖ్‌ఖాన్‌ నిలిచారన్న హురుస్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ముంబై

బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ దేశంలోనే అత్యంత ధనిక నటుడిగా నిలిచారని హురుస్ ఇండియా రిచ్‌లిస్ట్ వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఆయన సంపద కొంత తగ్గినప్పటికీ, రూ. 10 వేల కోట్ల నికర విలువతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ ద్వారా ఆయన భారీగా ఆర్జిస్తున్నారు. షారుఖ్‌ఖాన్ తర్వాతి స్థానంలో రూ. 4 వేల కోట్ల సంపదతో అమితాబ్ బచ్చన్ రెండో స్థానంలో నిలిచారని నివేదిక స్పష్టం చేసింది.