కశ్మీర్ అందాలను ప్రపంచానికి చాటాలని కోరిన ఏఆర్ రెహమాన్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: జమ్మూ మరియు కశ్మీర్
కశ్మీర్ అందాలను, ప్రశాంతతను వెండితెరపై చూపాలని బాలీవుడ్ దర్శకనిర్మాతలను ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కోరారు. హింసను పక్కనపెట్టి లోయలోని సుందర దృశ్యాలను తెరకెక్కించాలని అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని కొనియాడిన ఆయన, భవిష్యత్తులో అక్కడ లైవ్ మ్యూజిక్ షో నిర్వహించే ఆలోచన ఉందని తెలిపారు.