లక్నోలో అంతర్జాతీయ వన్యప్రాణి స్మగ్లర్ అరెస్ట్: రూ. 14 కోట్ల విలువైన అరుదైన ఫాల్కన్లు స్వాధీనం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Lucknow
ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు లక్నోలో నిర్వహించిన దాడుల్లో ముంబైకి చెందిన వన్యప్రాణి స్మగ్లర్ ఫిరోజ్ ముసారత్ ఖాన్ను అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ అవనీశ్వర్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఈ మేరకు నిందితుడి వద్ద నుంచి సుమారు పద్నాలుగు కోట్ల రూపాయల విలువైన ఏడు అరుదైన ఫాల్కన్ పక్షులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెట్వర్క్ దుబాయ్, సౌదీ అరేబియా దేశాలకు అరుదైన పక్షులను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.