ఏడీహెచ్డీ నిర్ధారణ అయిందంటూ ఒలింపిక్ విజేత క్లో కిమ్ వెల్లడి

రిపోర్టర్: విజయ్ స్థలం: USA

తనకు ఏడీహెచ్డీ నిర్ధారణ అయినట్లు ప్రముఖ ఒలింపిక్ స్నోబోర్డర్ క్లో కిమ్ వెల్లడించారు. రోజూవారీ జీవితంలో తీవ్ర అలసట, ఏకాగ్రత లోపంతో కొన్నాళ్లుగా ఇబ్బంది పడ్డానని ఆమె తెలిపారు. మానసిక వైద్యులను సంప్రదించాకే అసలు విషయం తెలిందని, స్నోబోర్డింగ్ చేస్తున్నప్పుడు మాత్రం తనకు పూర్తి ఏకాగ్రత ఉండేదని వివరించారు. ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు జీవనశైలి మార్పులతో పాటు మందులు వాడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమస్యపై అవగాహన పెంచేందుకు తాను ముందుకు వచ్చానని క్లో కిమ్ స్పష్టం చేశారు.