వ్యూవర్స్ కోసమే ఆవేశంతో మాట్లాడానంటూ పోలీసుల ఎదుట ప్రశ్న రావణ్ పశ్చాత్తాపం

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయవాడ

నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసి దేశద్రోహం కింద అరెస్టైన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ్ పోలీసు కస్టడీ ముగిసింది. వ్యూవర్స్ సంఖ్య పెరగడం కోసమే ఆవేశంలో మాట్లాడానని, దురుద్దేశాలు లేవని విచారణలో రావణ్ పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక మూలాలు, వివాదాస్పద వీడియోల తయారీపై పోలీసులు వారం పాటు విచారించి కీలక వివరాలు రాబట్టారు. కస్టడీ ముగిసిన తర్వాత రావణ్ ను విజయవాడ కోర్టులో హాజరుపరచగా అక్టోబరు 8 వరకు రిమాండ్ పొడిగించారు.