మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి: మెదక్ అదనపు కలెక్టర్ నగేష్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మెదక్
మెదక్ జిల్లాలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించాలని అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గోడపత్రికలను ఆవిష్కరించి, మట్టి విగ్రహాల పంపిణీని ప్రారంభించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీటి వనరులు కలుషితమవుతాయని, ప్రజలు పర్యావరణ హితమైన విగ్రహాలను వాడి ప్రకృతిని కాపాడాలని కోరారు.