రైతులకు భారీ ఊరటనిస్తూ రబీ పంటల కనిష్ట మద్దతు ధరల పెంపు

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

రబీ సీజన్ మార్కెటింగ్ సంవత్సరానికి సంబంధించి వివిధ పంటల కనిష్ట మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గోధుమలు, పప్పుధాన్యాలు, ఆవాలు, బార్లీ, కుసుమ వంటి ప్రధాన రబీ పంటల మద్దతు ధరలను సవరించినట్లు అధికారులు తెలిపారు. ఈ తాజా ధరల పెంపు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు ఆర్థిక భరోసాతో పాటు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.