సాలూరులో ప్రజావేదిక నిర్వహించి ప్రజల సమస్యలు విన్న మంత్రి
రిపోర్టర్: హరి
స్థలం: సాలూరు
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, సాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, భూ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రజలే కేంద్రబిందువుగా, సమస్యల పరిష్కారంలో వేగం, పారదర్శకత, బాధ్యతే తమ ప్రభుత్వ పాలనా లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.