ఘోరం: ఇంటర్ విద్యార్థినిని అపహరించి అత్యాచారం చేసి దారుణ హత్య
రిపోర్టర్: రాము
స్థలం: Kolkata
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా గైఘాటా ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదకొండో తరగతి చదువుతున్న పదిహేడేళ్ల మైనర్ బాలికను కొందరు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి అతి క్రూరంగా హత్య చేశారని ఎస్పీ బిదిష కలిత దాస్గుప్తా వెల్లడించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన ప్రహ్లాద్ దాస్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారని, లోతుగా విచారణ జరుపుతున్నామని తెలిపారు.