చిట్కారా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత
రిపోర్టర్: రమేష్
స్థలం: Patiala
పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లా చిట్కారా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు కనిపించట్లేదన్న తప్పుడు వదంతుల కారణంగా అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు విద్యార్థులు చేసిన ప్రాంక్ వల్ల ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమయ్యారంటూ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించడంతో వందలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘర్షణల్లో పోలీసులు వాహనాలు ధ్వంసమయ్యాయని, ఎలాంటి అదృశ్యాలు జరగలేదని యూనివర్సిటీ రిజిస్ట్రార్ కల్నల్ రాకేష్ శర్మ స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.