సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ రణబాలి టీజర్ విడుదల

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.