నర్సీపట్నంలో కూటమి ద్రోహులకు పవన్ కళ్యాణ్తో తగిన శాస్తి తప్పదన్న సూర్యచంద్ర

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా చింతకాయల పద్మావతి నామినేషన్ వేశారని నాయకుడు సూర్యచంద్ర స్పష్టం చేశారు. అయితే కూటమి నిబంధనలకు విరుద్ధంగా జనసేన నుంచి కొందరు వైఎస్సార్సీపీతో కుమ్మక్కై నామినేషన్ వేయడం తీవ్ర క్రమశిక్షణా ఉల్లంఘన అని ఆయన మండిపడ్డారు. పార్టీ అధిష్టానం, జిల్లా బాధ్యులు రమేష్ బాబు నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలుంటాయని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన ఖరాఖండీగా హెచ్చరించారు.