రూ.77 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎత్తిపోతల పథకాలకు చిన్నపాటి మరమ్మతులు చేపడితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అమరావతి వర్గాలు వెల్లడించాయి. కేవలం డెబ్బై ఏడు కోట్ల రూపాయలు వెచ్చిస్తే సుమారు లక్షా అరవై ఒక్క వేల ఎకరాలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు. తొలుత చిన్న మొత్తాల కేటాయింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలని, తద్వారా అన్నదాతలకు తక్షణ ప్రయోజనం కలుగుతుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.