తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఐదు లక్షల మంది భక్తులు

రిపోర్టర్: నరేష్ స్థలం: తిరుమల

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎనిమిది రోజుల్లో 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ కాలంలో రూ.28.94 కోట్ల హుండీ కానుకలు వచ్చాయని, 33 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు ఆయన వెల్లడించారు. సమిష్టి కృషి, శ్రీవారి కృప, భక్తుల అపార భక్తితోనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.