రైతులపై మంత్రి వ్యాఖ్యలు అహంకారపూరితం అంటూ బీఆర్ఎస్ ఫైర్
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
నీటి విడుదల కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనపై మంత్రి వాకిటి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు రైతాంగంపై తీవ్ర అహంకారానికి, నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పంటలను కాపాడుకోవడం కోసమే రైతులు నీటి కోసం పోరాటం చేస్తుంటే, వారిపై మంత్రులు ఇలా మాట్లాడటం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.