ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆహారాన్ని తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు!
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
ప్లాస్టిక్ సీసాలు మరియు వ్యవసాయ వ్యర్థాల నుంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తయారు చేసే అద్భుత టెక్నాలజీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. నాసా మద్దతుతో జరిగిన పరిశోధనలో జన్యుపరంగా మార్పు చేసిన ఈస్ట్‌ను ఉపయోగించి ప్లాస్టిక్‌ను తినదగిన ప్రోటీన్లు, విటమిన్లుగా మారుస్తున్నారు. అంతరిక్ష యాత్రికుల కోసం రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్లాస్టిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.