బీహార్లో మైనర్ జంటను వేధించిన నిందితుడిపై పోలీసుల కాల్పులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: జమూయి, బీహార్
బీహార్లోని జమూయిలో మైనర్ జంటను వేధించి అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. పరారవుతున్న సమయంలో నిందితుడి కాలిపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించగా, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.