ఏపీలో కాంట్రాక్ట్ వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందజేస్తూ ఉత్తర్వులు
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద పనిచేసే కాంట్రాక్ట్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు సహా ఇతర సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జేఏసీ విజ్ఞప్తుల మేరకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్, కమిషనర్ చక్రధర్‌బాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పంద ఉద్యోగుల సర్వీసు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తమవుతోంది.