వందేమాతరం పూర్తి గేయాలాపన నిబంధనలపై సుప్రీంకోర్టులో సవాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

జాతీయగేయం వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించాలనే కేంద్ర ప్రభుత్వ తాజా నిబంధనలను సవాల్ చేస్తూ కర్ణాటక సంగీతకారుడు టీఎం కృష్ణ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మతపరమైన అభ్యంతరాలతో పూర్తి గేయాన్ని పాడకుంటే శిక్షించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని, ఇది లౌకికవాదానికి విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించగా, సీజేఐ సూర్యకాంత్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.