పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్, 11 పాయింట్లు కోత

రిపోర్టర్: సునీల్ స్థలం: India

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన పాకిస్థాన్‌కు ఐసీసీ గట్టి షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ జట్టుకు 11 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల కోత విధించడంతో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. ఈ పెనాల్టీతో పాకిస్థాన్ జట్టు డబ్ల్యూటీసీ పట్టికలో మరింత దిగజారి తొమ్మిదో స్థానానికి పడిపోయింది.