1980ల నాటి వస్తువులతో వినూత్న గణేశ్ మండపం అలంకరణ

రిపోర్టర్: హరి స్థలం: గుజరాత్

గుజరాత్‌లోని నవసారిలో శ్రీ గణేశ్ యువక్ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 1980ల నాటి రోటరీ ఫోన్లు, ఆడియో క్యాసెట్లు, పాత నాణేలు, ఇన్‌లాండ్ లెటర్లతో ఈ వింటేజ్ థీమ్‌ను తీర్చిదిద్దారు. కనుమరుగవుతున్న పాతకాలపు జ్ఞాపకాలను, నాటి జీవనశైలిని నేటి తరానికి పరిచయం చేసేలా యువత చేసిన ఈ ప్రయత్నం విశేషంగా ఆకట్టుకుంటోంది.