న్యాయాధికారుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: India
న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఏడు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు రెండు నెలల్లోగా నిబంధనలు సవరించాలి. ఏపీ, తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేసే అంశంపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్థిక భారం సాకుతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేయవద్దని హెచ్చరించింది.