అమెరికాలో చిప్పలు తోమినోడికి నా విలువ తెలుస్తదంటూ కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: సిరిసిల్ల
అమెరికా హోటళ్లలో చిప్పలు తోమినోడికి నా విలువ ఏం తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిలదీశారు. సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, సిరిసిల్ల గడీని నేలమట్టం చేస్తామని పిలుపునిచ్చారు. గత పాలనలో ఫామ్‌హౌస్‌లు, స్టార్ హోటళ్లు సంపాదించుకోవడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ నేతల అక్రమాస్తులపై పార్ట్-2 కింద అన్ని లెక్కలు బయటపెడతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.