అగ్నివీరులకు భారీ ఊరట: సేవా కాలం రెండేళ్లు పొడిగింపునకు కేంద్రం నిర్ణయం

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరిన అగ్నివీరులకు అదనంగా మరో రెండేళ్ల సేవా కాలం కల్పించనున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి వెల్లడించారు. నాలుగేళ్ల ప్రాథమిక సేవ ముగిసిన తర్వాత బయటకు వెళ్లాల్సిన వారిలో కొందరికి ఈ అవకాశం దక్కనుంది. డిసెంబర్ 2026 నాటికి గడువు తీరే సుమారు పద్దెనిమిది వేల మందికి పైగా అగ్నివీరులకు దీనివల్ల లబ్ధి చేకూరనుందని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.