'ఓటర్ల తుది జాబితాలు ప్రచురించాలి': రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

రాష్ట్రంలో మరో 41 పట్టణ స్థానిక సంస్థల్లో ఫొటో ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, కర్నూలుతో పాటు వివిధ నగరపాలికలు, పురపాలికలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఈనెల 22న ఓటర్ల తుది జాబితాలు ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఇప్పటికే 59 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ప్రక్రియ పూర్తికాగా, మొత్తంగా 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.