సంచలన ప్రకటన: రెండో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ సింగర్ రిమి టామీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: Kerala
తాను రెండో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రముఖ మలయాళ గాయని రిమి టామీ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పష్టం చేశారు. తన జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించారని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆమె తెలిపారు. తన కాబోయే భర్త ఎలాంటి సెలబ్రిటీ కాదని, సాధారణ వ్యక్తి అని సింగర్ స్పష్టం చేశారు. గతంలో తన పెళ్లిపై వచ్చిన పుకార్లను ఆమె గుర్తు చేసుకుంటూ, అభిమానులతో ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.