రాష్ట్రంలో ఉద్రిక్తత: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లో ఘర్షణలు
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా పెనగలూరు మండలం నల్లపరెడ్డిపల్లిలో పోలింగ్ కేంద్రం సమీపంలో పెట్రోల్ బాంబులతో దాడి జరగడం కలకలం రేపింది. నంద్యాల, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్ లో వివిధ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు, రాళ్లు, కర్రలతో దాడులు చోటు చేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.