బసంపల్లిలో వినాయక చవితి వేడుకలకు దూరంగా గ్రామస్థులు

రిపోర్టర్: రాము స్థలం: శ్రీసత్యసాయి జిల్లా

శెట్టూరు మండలం బసంపల్లి గ్రామంలో వినాయక చవితి పండగను జరుపుకోరు. గ్రామదేవత మారెమ్మ అమ్మవారి ఉత్సవాలు అదే సమయంలో జరగడమే ఇందుకు కారణం. ఉత్సవాల సమయంలో బంధువులతో ఇళ్లు నిండిపోయి మాంసాహారం వండుతారు కాబట్టి, వినాయకుడు అపవిత్రం కాకూడదనే ఉద్దేశంతో చాలా ఏళ్లుగా గ్రామస్థులు ఈ ఆనవాయితీని పాటిస్తున్నారు.