నిత్యవసర ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.. కాంగ్రెస్ నాయకులు మువ్వల శ్రీనివాసరావు ఆరోపణ!

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మార్కెట్లో కూరగాయలు, పప్పుల ధరలు ఆకాశాన్ని అంటాయని, పేద మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సబ్సిడీపై వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు.