యువతలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సేవ ఫస్ట్ ఛాలెంజ్ ప్రారంభం

రిపోర్టర్: రమేష్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో విద్య మంత్రి ఆశిష్ సూద్ సేవ ఫస్ట్ రాష్ట్రీయ యూత్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026ను ప్రారంభించారు. వంద రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో యువత తమ సరికొత్త ఆలోచనలతో వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా ప్రోత్సహించనున్నారు. ఈ వేడుకలో రూ. రెండు కోట్ల నగదు బహుమతి పూల్ తో పాటు విద్యార్థులు, పరిశోధకులకు మెంటరింగ్ అందించనున్నారు.