మైలార్దేవ్పల్లిలో దారుణ హత్య కేసును ఛేదించిన పోలీసులు, ముగ్గురు అరెస్ట్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Mailardevpally, Hyderabad
హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో జరిగిన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మృతుడి మొబైల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.