'డెడ్లీ లంచ్‌తో క్యాంపస్‌లో అరాచకం': ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ధన, కండబలం విపరీతంగా ప్రయోగిస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. క్యాంపస్‌లో కాల్పులు, హింసాత్మక ఘటనలు జరిగి విద్యార్థులు గాయపడ్డారని, నంబర్ ప్లేట్లు లేని రోల్స్ రాయిస్ కార్లు, ట్రాక్టర్లతో భారీగా అరాచకం సృష్టిస్తున్నారని పిటిషన్లో ఆరోపించారు. లింగ్డో కమిటీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని కోర్టును కోరారు.