ప్రతి నియోజకవర్గానికి పది వేల ఇళ్లు మంత్రి అచ్చెన్నాయుడు
రిపోర్టర్: గోపి
స్థలం: శ్రీకాకుళం
ప్రతి నియోజకవర్గానికి సుమారు పది వేల ఇళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హతనే ప్రాతిపదికగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. పార్టీలు చూడొద్దని, కేవలం పేదరికం మాత్రమే చూసి ఇళ్లు కేటాయించాలని అధికారులకు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకతతో కూడిన పాలన అందిస్తామని ఆయన తేల్చిచెప్పారు.