'మేము రాజ్యాంగాన్ని మాత్రమే నమ్ముతాం': అక్బరుద్దీన్ ఓవైసీ ఫైర్
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
హెడ్గేవార్, గోల్వాల్కర్, సావర్కర్ సిద్ధాంతాలను తాము నమ్మమని, కేవలం రాజ్యాంగాన్ని మాత్రమే గౌరవిస్తామని AIMIM పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. దేశంలో మతతత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే శక్తులపై పోరాటం కొనసాగిస్తామని, దేశ ప్రజల హక్కుల పరిరక్షణే తమ ప్రధాన ధ్యేయమని ఆయన తేల్చిచెప్పారు.