సినిమాలపై విమర్శలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఒక దారుణ నేర ఘటనపై సినిమాలను బాధ్యులను చేయడం సరికాదని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మండిపడ్డారు. యానిమల్ సినిమాలోని సన్నివేశాలను ప్రస్తావిస్తూ తనపై వస్తున్న విమర్శలపై ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. విషాదకర ఘటనలను వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, అవకాశవాద విమర్శలకు వేదికగా మార్చుకోవడం తగదని ఆయన తీవ్రస్థాయిలో హితవు పలికారు.