పోలింగ్ కేంద్రం వద్ద బురదమయం: ఓటు వేసేందుకు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడ్డ ఓటర్లు

రిపోర్టర్: రమేష్ స్థలం: జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం ఆవరణలోకి వర్షపు నీరు చేరి బురదమయంగా మారిందని ఆర్వో శ్రీనివాస్ తెలిపారు. దీంతో ఓటు వేసేందుకు వచ్చిన మహిళలు, ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వారు వాపోయారు. కనీస వసతులు కల్పించకపోవడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సీతానగరం గ్రామానికి చెందిన నూట రెండు ఏళ్ల వృద్ధుడు గారపాటి వెంకన్న పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.