ఇంటింటికి టీడీపీ ప్రచారం.. సమస్యలు అడిగి తెలుసుకున్న నేతలు

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలో రెండు సంవత్సరాల విజయాలు, అభివృద్ధి, సంక్షేమంపై 'ఇంటింటా తెలుగుదేశం' కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లస్టర్ 10 ఇంచార్జ్, ఎక్స్ కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ నేతృత్వంలో ఈ ప్రచారం కొనసాగింది.

బూత్ నంబరు 256లో నేతలు ఇంటింటికి తిరిగి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.