కడప అభివృద్ధిపై చర్చకు సిద్ధమా: సీఎం చంద్రబాబు సవాల్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Kadapa
కడప జిల్లా ప్రొద్దుటూరు పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరిగిందని, కడప జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేంద్ర నిధులను రాబట్టడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గోదావరి కావేరి నదుల అనుసంధానం ద్వారా నాలుగు రాష్ట్రాల సాగునీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని సీఎం స్పష్టం చేశారు.