షాకింగ్ ఘటన: భార్యను పంపలేదన్న కోపంతో మామను హత్య చేయించిన అల్లుడు

రిపోర్టర్: అశోక్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లాలో భార్యను కాపురానికి పంపడం లేదనే కక్షతో మామను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఘటన కలకలం రేపింది. బసవరాజ్ అనే వ్యక్తి తన భార్య తండ్రి, ఆటో డ్రైవర్ శ్రీనివాస్ను అంతం చేసేందుకు నలుగురితో ఐదు లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు శ్రీనివాస్ను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి, ఆటోతో సహా దహనం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.