కాంగ్రెస్ పార్టీ దేశానికి చారిత్రాత్మక విముక్తి కల్పించింది: సీఎం రేవంత్
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
అణచివేత, దోపిడీలో మగ్గుతున్న దేశానికి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక విముక్తి కల్పించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య పోరాట త్యాగాలను కొనియాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాగమే దేశ ప్రగతికి మూలమని తెలిపారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.