కృత్రిమ మేధతో హాలీవుడ్లో సరికొత్త దృశ్య విప్లవం సృష్టిస్తున్న స్టార్మ్ డాగ్స్
రిపోర్టర్: నరేష్
స్థలం: హాలీవుడ్
ప్రముఖ దర్శకుడు రాబ్ మింకాఫ్ తెరకెక్కిస్తున్న స్టార్మ్ డాగ్స్ సినిమాతో చిత్ర పరిశ్రమలో కృత్రిమ మేధ టెక్నాలజీ ఆధారంగా విప్లవాత్మక మార్పులు రానున్నాయని సినీ విశ్లేషకులు తెలిపారు. ఐదు కుక్కలు మరియు ఒక చిన్నారి మధ్య జరిగే ఇరవై నాలుగు గంటల భావోద్వేగ ప్రయాణంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాంప్రదాయ లైవ్ యాక్షన్ పద్ధతులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సహాయంతో నటుల హావభావాలను డిజిటల్ యానిమేషన్ పాత్రలకు జోడించి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.