దిల్లీలో దుకాణాల మూసివేతపై రాహుల్ గాంధీ ఆగ్రహం: బీజేపీపై తీవ్ర విమర్శలు

రిపోర్టర్: సురేష్ స్థలం: దిల్లీ

దిల్లీలో ఇండీ కూటమి ర్యాలీకి ముందు కనాట్ ప్లేస్ లో దుకాణాలను బలవంతంగా మూసివేయించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. స్థానిక వ్యాపారులకు బీజేపీ ప్రభుత్వం నష్టం కలిగిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ర్యాలీలో పాల్గొనేవారు చిన్న వ్యాపారుల వద్ద కొనుగోళ్లు చేయాలని కోరామని, అయితే షాపులన్నీ మూసివేయడాన్ని తాము గమనించామని పేర్కొంటూ వ్యాపారులకు ఎవరు నష్టం చేస్తున్నారో ప్రజలు గుర్తించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.