ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు వివాదం: సీబీఐ విచారణ కోరిన ఏబీ వెంకటేశ్వరరావు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. టెండర్ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని ఆయన ఆరోపించారు. అయితే పిటిషనర్ వాదనలు పూర్తిగా నిరాధారమని, ఊహాగానాలతోనే పిటిషన్ దాఖలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు.