రష్యా డీజిల్ డీల్‌పై స్పష్టత ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
రిపోర్టర్: విజయ్
స్థలం: Washington
అమెరికా కోసమే రష్యా డీజిల్ ఒప్పందం కాదని, ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలను తగ్గించడానికేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న మార్కెట్‌ను స్థిరీకరించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ తొమ్మిదో తేదీన రష్యా నుంచి మూడు లక్షల టన్నుల డీజిల్ సరఫరా కానుందని, నవంబర్ మరియు ఆ తర్వాత మరో పది లక్షల టన్నులు అందనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.