అంతర్జాతీయంగా కియా పీవీ7 ఎలక్ట్రిక్ వ్యాన్ ఆవిష్కరణ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో కియా మోటార్స్ మరో అడుగు ముందుకేసి తన రెండో ఎలక్ట్రిక్ వ్యాన్ అయిన పీవీ7ను అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. ప్యాసింజర్ మరియు కార్గో వెర్షన్లలో రానున్న ఈ భారీ వ్యాన్ గరిష్టంగా 11 మంది ప్రయాణికులకు లేదా 1200 కిలోల పేలోడ్ మోయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో 71.5kWh మరియు 96.2kWh బ్యాటరీ ఆప్షన్లతో పాటు 460 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.