షాకింగ్ ఘటన: నకిలీ ఫేస్బుక్ పేజీపై నటి రితికా సింగ్ ఆగ్రహం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

తన పేరుతో నకిలీ ఫేస్బుక్ పేజీని సృష్టించి నెటిజన్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్న మోసగాళ్లపై నటి రితికా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పేజీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసిన వీడియోలో నకిలీ ఖాతాల పట్ల జాగ్రత్త వహించాలని కోరినట్లు ఆమె తెలిపారు.