హైదరాబాద్ ట్రాఫిక్కు చెక్: శివార్లలో కొత్త టెర్మినల్స్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్, తెలంగాణ
హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నగరానికి నలువైపులా ఆధునిక బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో వీటిని పరిశీలిస్తున్నారు. దూరప్రాంత బస్సులు శివార్లలోనే ఆగి, అక్కడి నుండి ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ కల్పిస్తారు. ప్రైవేట్ బస్సులకూ ఇదే విధానం వర్తిస్తుంది.