ప్రకాశం జిల్లాలో దారుణం: ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య
రిపోర్టర్: గోపి
స్థలం: Prakasam
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను అదే కాలనీకి చెందిన ఆనంద్ అనే వ్యక్తి అపహరించి అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చిన్నారి మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచి పరారైన నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.