పేదరికం నిరుద్యోగం నుంచి విముక్తి సాధించేలా సాగాలి:డా.శివప్రసాద్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నాంపల్లి
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో రజాకార్ల నిరంకుశ పాలన నుంచి ప్రజలు విముక్తి పొందిన చారిత్రాత్మక దినమని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివ ప్రసాద్ తెలిపారు. ఆనాటి విముక్తి స్ఫూర్తిని నేటి తరానికి అందిస్తూ ప్రజల జీవితాల్లో సంపూర్ణ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పేదరికం, అనారోగ్యం, నిరుద్యోగం నుంచి ప్రజలకు విముక్తి లభించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేస్తూ ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని కోరారు.